మెగాస్టార్ ‘సైరా’ లో అనుష్క..?

Monday,February 04,2019 - 02:48 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సైరా టీమ్. మొన్నటికి మొన్న అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, ఆ తరవాత ఇమ్మీడియట్ గా భారీ ‘జాతర’ సాంగ్ ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో అనుష్క కూడా జాయిన్ కానుందా…? అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నా కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడిదే వరసలో అనుష్క పేరు కూడా వినిపిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఫోకస్ పెరుగుతుంది. మరికొన్ని చోట్ల అనుష్క సినిమాలోని ఒక సందర్భంలో పవర్ ఫుల్ వారియర్ గా కనిపిస్తుందనే బజ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది.

‘సైరా’ లో అనుష్క అనేది జస్ట్ రూమరా..? లేకపోతే అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్చి నుండి సెట్స్ పైకి రానున్న కొత్త సినిమా ప్రిపరేషన్స్ లో ఉంది అనుష్క.  హేమంత్ మధుకర్ ఈ సినిమాకి డైరెక్టర్. మాధవన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు.