డిఫెరెంట్ లుక్స్ లో అనుష్క

Wednesday,December 21,2016 - 10:56 by Z_CLU

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ లో అనుష్క కృష్ణమ్మ క్యారెక్టర్ లో నటిస్తుంది. ఈ విషయం తెలిసిందే అయినా, ఈ సినిమాలో అనుష్క లుక్స్ కోసం సినిమా యూనిట్ తీసుకున్న కేర్, ఇప్పుడు ఉన్న కాన్సంట్రేషన్ అంతా తన వైపు తిప్పుకుంటుంది.

అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు కానీ అనుష్క ఈ సినిమాలో ఏకంగా నాలుగు క్యారెక్టర్స్ పోషిస్తుందని టాక్. కృష్ణమ్మ క్యారెక్టర్ తో పాటు గోదాదేవి గా కూడా ఎట్రాక్ట్ చేయనుందట అనుష్క. ఈ క్యారెక్టర్  కోసం ఏకంగా 25 మీటర్ల చీర తయారు చేయించారని సమాచారం.

పిక్ చేసుకున్న జోనర్ ఏదైనా తెరకెక్కిస్తే అద్భుతాన్నే తెరకెక్కించాలని డిసైడ్ అవుతాడు రాఘవేంద్ర రావు. ఇప్పటికే హై ఎండ్ క్రేజ్ క్రియేట్ అయిన ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్.