అనుష్క ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Wednesday,January 24,2018 - 03:50 by Z_CLU

జనవరి 26 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ రెడీగా ఉంది అనుష్క భాగమతి. ఇప్పటికే ట్రైలర్ తో, ప్రమోషనల్ సాంగ్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను ఎక్స్ క్లూజివ్ గా ‘జీ సినిమాలు’ తో షేర్ చేసుకుంది అనుష్క. ఆ చిట్ చాట్ మీ కోసం…

నాక్కూడా భయమేస్తుంది….

భాగమతి ట్రైలర్, పోస్టర్స్ చూస్తుంటే నాక్కూడా భయమేస్తుంది. వరసగా ఇలాంటి సినిమాలు చేస్తూ పోతే, జనాలు ఇంకా నా దగ్గరికి రారేమో అనిపిస్తుంది.(నవ్వుతూ..)

ట్రైలర్ లో అసలేమీ లేదు….

సినిమాలో ఉండే ఎగ్జైటెడ్ ఎలిమెంట్స్ ఏవీ ట్రైలర్ లో రివీల్ చేయలేదు. ఆ ఎగ్జైట్ మెంట్ లూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ట్రైలర్ కట్ చేయడం జరిగింది. కాబట్టి ట్రైలర్ లో చూసింది సినిమా కాదు….

సినిమాలో ప్రతీది ఇంపార్టెంటే…

సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా క్రూషల్. భాగమతి బంగ్లాతో పాటు తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

అప్పటి స్క్రిప్ట్ ఇది….

భాగమతి స్టోరీ నేను ‘మిర్చి’ సినిమా చేసేటప్పుడే విన్నాను. డేట్స్ కుదరకపోవడంతో ఇంత టైమ్ పట్టింది. నాకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు అశోక్ కి, UV క్రియేషన్స్ కి థాంక్స్ చెప్పుకోవాలి.

అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా….

హారర్ జోనర్ అనగానే అందరూ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయనుకుంటారు కానీ భాగమతి సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఏ సీన్ చూసినా, సిచ్యువేషన్ కి కంప్లీట్ గా కనెక్ట్ అయిపోతాం.

 

అరుంధతి ఇంపాక్ట్ ఏ మాత్రం ఉండదు…

‘భాగమతి’ లాంటి పవర్ ఫుల్ సినిమా అనగానే అందరూ అరుంధతి తో కంపేర్ చేయడం చాలా కామన్. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏ మాత్రం ఈ సినిమాపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. లుక్స్ దగ్గరి నుండి బిగిన్ చేస్తే ప్రతీది డిఫెరెంట్ గా ఉంటుంది. అసలు ఆ సినిమాకు ఈ సినిమాకు ఏ పాత్రం పోలిక ఉండదు.

ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందనుకోలేదు

భాగమతి అడ్డా.. అనే డైలాగ్ సినిమాలో సిచ్యువేషన్ ని బట్టి చాలా ఇంపాక్ట్ ఉన్న డైలాగ్.  కానీ అది బయట కూడా ఈ రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తుందనుకోలేదు…

UV క్రియేషన్స్ మ్యాటర్స్…

UV క్రియేషన్స్ బ్యానర్ అంటేనే ప్రొడక్షన్ వ్యాల్యూస్. ఆ బ్యానర్ లో సినిమా అంటే… వాళ్ళే అన్ని ఆలోచించుకుని ఫిక్స్ అవుతారు. వంశీ, ప్రమోద్ గారు అశోక్ దగ్గర స్టోరీ ఉంది వినమన్నప్పుడు అశోక్ గారి ఎక్స్ పీరియన్స్ అదీ ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కానీ ఒకసారి అశోక్ తో జర్నీ బిగిన్ చేశాక అర్థమైపోయింది. ఆయన నాలెడ్జ్ కానీ, క్లారిటీ కానీ వండర్ ఫుల్ ఫిల్మ్ మేకర్.

ఒకే పాట….

సినిమా మొత్తంలో ఒకే పాట ఉంటుంది. దాంతో పాటు ఒక ప్రమోషనల్ సాంగ్ అంతే…

ఇప్పటికీ భయపడతా….

ప్రతి సినిమా, క్యారెక్టర్ ఎప్పటి కప్పుడు కొత్తగానే అనిపిస్తుంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నట్టే ఉంటుంది. ఇప్పటికీ భయపడుతుంటా. కెమెరా ముందుకు వెళ్లి నిలబడ్డాక సడెన్ గా యాక్టింగ్ రాకపోతే ఎలా..? ఆ క్యారెక్టర్ ని సరిగ్గా ప్లే చేయలేపోతే ఎలా..? ఏ సినిమా కేక్ వాక్ కాదు…

నాకు సిగ్గెక్కువ….

నేను స్టిల్ ఫోటోస్ పెద్దగా దిగను. ఇప్పటికీ ఫోటో షూట్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నా గురించి తెలిసిన వాళ్ళెవరూ నాతో ఫోటో షూట్ ప్లాన్ చేయరు. ఈ సినిమాకు కూడా చేయలేదు. భాను గారు, భాస్కర్ గారు ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్ళే కాబట్టి ఆ అవసరం కూడా రాలేదు.

బ్లెస్సింగ్ అనే అనుకుంటున్నాను…

ఈ రోజు ఈ స్థాయికి రీచ్ అయ్యాను అంటే బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. నేనేదీ ప్లాన్  చేయలేదు. ఫస్ట్ టైమ్ సుప్రియ గారిని, పూరి జగన్నాథ్ గారిని, నాగార్జున గారిని కలిసినప్పుడు నాకు కనీసం యాక్టింగ్ కూడా రాదు. ఆ తరవాత కూడా ఎప్పుడెప్పుడు పారిపోవాలా అనిపించేది. కానీ అరుంధతి విన్నప్పుడు, వెళ్ళే ముందు కనీసం ఏదైనా నేర్చుకుని వెళ్ళాలి అని ఒప్పుకున్నాను….

ఫ్రెష్ నెస్ ఉంటుంది….

సినిమాలో ప్రభాస్ శ్రీను, ధనరాజ్, విద్యుల్లేఖ తప్ప ఉన్ని ముకుందన్, ఆశా శరత్, జయరాం, ముని శర్మ వీళ్ళందరి వల్ల సినిమాకి మరింత ఫ్రెష్ నెస్ ఆడ్ అయింది. స్క్రిప్ట్ ని బట్టి ఎవరూ ఆ క్యారెక్టర్ కి మ్యాచ్ అవుతారో వాళ్ళనే ప్రిఫర్ చేయడం జరిగింది.

పోటీ పడి చేశారు….

సినిమాలో బంగ్లా గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఆ సెట్ మేకింగ్ లో కూడా ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఇలా ఉంటే, సౌండ్ ఇలా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది అని ప్లాన్డ్ గా, ప్రతి డిపార్ట్ మెంట్ పోటీ పడి మరీ పని చేశారు.

భాగమతి తో పాటు పద్మావతి….

భాగమతి తో పాటు పద్మావతి కూడా రిలీజవుతుంది. నేను ఆ సినిమా కోసం కూడా అంతే ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను.