అనుష్క బర్త్ డే స్పెషల్

Wednesday,November 07,2018 - 09:58 by Z_CLU

‘సూపర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయినప్పటి నుండి, చేసిన ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నవంబర్ 7, 1981 కర్ణాటకలోని మంగళూరులో పుట్టింది. జేజమ్మ, దేవసేన, రుద్రమదేవి ఇలా చెప్పుకుంటూ పోతే, క్యారెక్టర్ ఎలాంటిదైనా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి పర్ఫామ్ చేసే అనుష్క శెట్టి, ఈ రోజు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

 

2005 లో సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ యోగ టీచర్, ఫస్ట్ సినిమాతోనే యూత్ ఫిదా అయ్యే రేంజ్ లో మ్యాజిక్ చేసింది. ఆ తరవాత జస్ట్ ఏడాది గ్యాప్ లో ‘విక్రమార్కుడు’ సినిమాతో మరో హిట్ కొట్టింది.

విక్రమార్కుడు తరవాత వరసగా రిలీజైన లక్ష్యం, డాన్, ఒక్క మగాడు, చింతకాయల రవి లాంటి సినిమాలు అనుష్కను పక్కా కమర్షియల్ హీరోయిన్ అని ప్రూఫ్ చేస్తే, కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అరుంధతి’ సినిమా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయడమే కాదు, అనుష్కలోని రియల్ స్టామినాని ఎలివేట్ చేసింది.

ఓ వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరో సినిమాలకు ధీటుగా సత్తా చాటుతూనే, మరోవైపు మిర్చి, సింగం, లింగ లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేసింది అనుష్క. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే, సేమ్ టైం గ్లామర్ క్వీన్ అనిపించుకుంది.

అనుష్క 12 ఏళ్ళ కరియర్ లో 2015 నుండి 2017 వరకు సెన్సేషన్ ఇయర్ అనే చెప్పుకోవాలి. బాహుబలి – ది బిగినింగ్, రుద్రమదేవి, సైజ్ జీరో, ఊపిరి, బాహుబలి 2 – కంక్లూజన్, భాగమతి సినిమాలు అనుష్క స్థాయిని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కు దూరమైన ఈ బ్యూటీ.. తిరిగి సినిమాల్లోకి రావాలని కోరుకుంటూ.. ఆమెకు బర్త్ డే విశెష్ అందిస్తోంది జీ సినిమాలు.