అనుష్క ‘భాగమతి’ రిలీజ్ డేట్

Friday,November 17,2017 - 05:10 by Z_CLU

రీసెంట్ గా రిలీజయిన అనుష్క ‘భాగమతి’ ఫస్ట్ లుక్ సినిమా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండటం గ్యారంటీ అనిపించుకుంది. అయితే అప్పుడే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని రివీల్ చేసింది సినిమా యూనిట్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది భాగమతి.

వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అనుష్క కరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. గ్లామరస్ రోల్స్ అయినా, ఫీమేల్ సెంట్రిక్ ఎంటర్ టైనర్స్ అయినా తన మార్క్ పర్ఫామెన్స్ తో ఎట్రాక్ట్ చేసే అనుష్క, ఈ సినిమా కోసం మరింత బరువు తగ్గినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్ లు ఈ  సినిమాలో  కీ రోల్ ప్లే చేస్తున్నారు.