అనుష్క భాగమతి రిలీజ్ డేట్ ఫిక్సయింది

Monday,March 06,2017 - 08:06 by Z_CLU

అనుష్క భాగమతి కి రిలీజ్ డేట్ ఫిక్సయింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తుంది. G. అశోక్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, సెట్స్ పై ఉండగానే రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిపోయింది. ఆగష్టు 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడానికి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతుంది భాగమతి.

నిన్న మొన్నటి వరకు బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అనుష్క, ఆ మధ్య వెయిట్ తగ్గించుకునే ప్రాసెస్ లో కెమెరాకి కాస్త దూరంగా ఉందనిపించినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం అసలు ఆ గ్యాప్ కించిత్ కూడా ఎఫెక్ట్ కాలేదు.

 

 

రీసెంట్ గా రిలీజైన సూర్య సింగం లో హీరోయిన్ గా కనిపించిన అనుష్క, అటు నాగార్జున ఓం నమో వెంకటేశాయ లోను కృష్ణమ్మగా మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు భాగమతి గా సెట్స్ పై ఉన్న అనుష్క, ఏప్రియల్ లో బాహుబలి 2 తో మళ్ళీ థియేటర్స్ లో హల్ చల్ చేస్తుంది. వీటితో పాటు అనుష్క అకౌంట్ లో ఆల్ రెడీ బడా బడా ప్రాజెక్ట్స్ ఫిక్స్ అయి ఉన్నాయని సమాచారం. అఫీషియల్ అనౌన్స్ మెంటే బ్యాలన్స్.