అనుపమ ఇంటర్వ్యూ

Saturday,October 28,2017 - 03:10 by Z_CLU

‘ప్రేమమ్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై  తర్వాత ‘అ ఆ’, ‘శతమానం భవతి’ సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న లక్కీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’.. ఇటీవలే రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మీడియాతో ముచ్చటించింది ఆ బ్యూటీ. ఆ విశేషాలు అనుపమ మాటల్లోనే.

 

చాలా హ్యాపీ గా ఉంది 

సినిమా రిలీజ్ అయ్యాక నేను చేసిన మహా క్యారెక్టర్ గురించి ఎప్పటి లాగే మంచి కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్బుక్ లో చాలా మంది నా క్యారెక్టర్ చాలా బాగుందని మెసేజెస్ చేస్తున్నారు. నా ప్రీవియస్ డైరెక్టర్స్ కూడా మహా క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అని చెప్తున్నారు. ఈ క్యారెక్టర్ కి వస్తున్న రెస్పాన్స్ తో చాలా హ్యాపీ గా ఫీలవుతున్నా.

 

నా అదృష్టం

తెలుగులో ఇప్పటి వరకూ నేను చేసిన ప్రతీ క్యారెక్టర్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ‘అఆ’లో నాగవల్లి క్యారెక్టర్ , ‘ప్రేమమ్’లో సుమ క్యారెక్టర్, ‘శతమానంభవతి’ లో నిత్య ఇలా ప్రతీ క్యారెక్టర్ నటిగా నాకు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. చాలా మంది షూటింగ్స్ లో కలిసి ‘అ ఆ’ లో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ‘శతమానం భవతి’లో చాలా క్యూట్ గా చేశారు..అంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నిజానికి వరుసగా ఇలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నా.

 

నా ఫేవరేట్ సీన్ అదే 

సినిమాలో ఫస్ట్ హాఫ్ నా ప్రెజెన్స్ కంటే సెకండ్ హాఫ్ లో ఓ మెయిన్ సీన్ లో వచ్చే ప్రెజెన్స్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ సీన్స్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశా.. ఆ సీన్ చూసేటప్పుడు మరింత నచ్చింది.

 

ఎవర్నీ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యా

ఆడియో రిలీజ్ లో నా స్పీచ్ బాగుందని మా యూనిట్ చెప్పారు. నిజానికి  సినిమా చేయడానికి నాకు హెల్ప్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పాలని ఫిక్స్ అయ్యా..కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని మిస్టెక్స్ వస్తుంటాయి. అయినా పరవాలేదు తెలుగులోనే అందరికీ థాంక్స్ చెప్పాలని ఎవర్నీ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యా.. అందుకే  భయపడకుండా నాకు అనిపించింది చెప్పాలనిపించింది  ధైర్యంగా చెప్పేశా. అవన్నీ నా మనసులో నుంచి వచ్చిన మాటలే.  ప్రిపేర్  అయి మాట్లాడింది కాదు.

 

రామ్ కి నాకు కామన్ పాయింట్…

రామ్ చాలా ఎనెర్జిటిక్ అండ్ స్వీట్ & కూల్ పర్సన్.. జనరల్ గా రామ్ కి నాకు ఓ కామన్ పాయింట్ ఉంది. మా ఇద్దరికీ షూటింగ్ లేకపోయినా స్పాట్ కి వెళ్లి మానిటర్ దగ్గర కూర్చొని ఎవరెవరూ ఎలా చేస్తున్నారు సినిమా ఎలా వస్తుంది..అని ఓ లుక్ వేస్తుంటాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు రామ్ లో నాకున్న బెస్ట్ క్వాలిటీ గమనించా.

 

డైలాగ్స్ కి ఇంప్రెస్స్ అయిపోయా

ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయని చెప్తున్నారు. నిజానికి సీన్ చేసే టప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు కిశోర్ గారు రాసిన డైలాగ్స్ కి బాగా ఇంప్రెస్స్ అయిపోయా. అందుకే ఆడియో రిలీజ్ లో ఆయన డైలాగ్స్ గురించి పర్టిక్లర్ గా మాట్లాడా.

 

అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది

నటిగా వెర్సటైల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తా. అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తేనే నటిగా మనం ఎదిగినట్లు నమ్మే వ్యక్తిని నేను.

 

డబ్బింగ్ చెప్పడానికి రీజన్ అదే

మన సీన్ మనమే ఫీలయ్యి డబ్బింగ్ చెప్తే ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ జడ్జ్ చేసినట్లు ఫీలవుతా.. అందుకే తెలుగు రాక పోయినా నేర్చుకొని మరీ నా క్యారెక్టర్స్ కి నేనే డబ్బింగ్ చెప్తున్నా. మనం నటించిన  సీన్స్ కి మనం ఫీలయ్యి డబ్బింగ్ చెప్తుంటే ఆ కిక్కే వేరు. ప్రెజెంట్ ప్రతీ సినిమాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ హ్యాపీ నెస్ ను ఎంజాయ్ చేస్తుంటా.

 

వాళ్ళే  నా బెస్ట్ క్రిటిక్స్

నిజానికి నేను ఏ సినిమా చేసినా ముందుగా నా క్యారెక్టర్ గురించి పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చేది మా అమ్మ , నాన్న , తమ్ముడే.. వాళ్ళే నాకు బెస్ట్ క్రిటిక్స్ వాళ్ళ సజిషన్స్ తీసుకుంటూ ముందు కెళ్తుంటా.

 

కొంచెం ఫీలయ్యాను.. అందుకే .

ఈ మధ్య ఓ పెద్ద సినిమా మిస్ అవ్వడంతో కొంచెం ఫీలయ్యాను. బేసిక్ గా నేను సెన్సి టీవ్ దేన్నైనా ఈజీ గా తీసుకోలేను. ఆ సినిమా మిస్ అవ్వడాన్ని తట్టుకోలేకపోయా. అందుకే సోషల్ మీడియాలో ఇన్స్పైరింగ్ లైన్స్ పెట్టి దాని ద్వారా నాతో పాటు కొన్ని మిస్ అవుతున్న వారందరికీ ఓ మెసేజ్ పెట్టా.

 

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్

ప్రస్తుతం తెలుగులో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నానితో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నా.. దానితో పాటు కరుణాకరన్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ తో ఓ సినిమా కూడా చేస్తున్నా. అది ప్యూర్ లవ్ ఎంటర్టైనర్.