'అనుపమ పరమేశ్వరన్' ఇంటర్వ్యూ

Thursday,July 25,2019 - 04:20 by Z_CLU

‘హలో గురు ప్రేమకోసమే’ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుపమ నటించిన ‘రాక్షసుడు’ ఆగస్ట్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనుపమ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఈ బ్యూటీ మాటల్లోనే…

చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్

‘రట్ససన్’ చూసి మా నాన్న బాగుంది… చూడమని రిలీజ్ టైంలో చెప్పారు. కానీ షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల అప్పుడు చూడలేకపోయాను. ఈ సినిమా
గురించి రమేష్ వర్మ గారు చెప్పినప్పుడు అప్పటికి నేను సినిమా చూడలేదు. ఆ తర్వాతే సినిమా చూసాను. చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్ అనిపించింది.మాములుగా ఓ కమర్షియల్ సినిమా కాకుండా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా. క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉందనిపించింది. అందుకే ఒక మంచి సినిమాలో నేను కూడా భాగం అవ్వాలన్న ఉద్దేశ్యంతో సినిమా నచ్చి చేసాను.

అందుకే గ్యాప్

‘హలో గురు ప్రేమకోసమే’ తర్వాత తెలుగులో నాకు నచ్చే కథ రాలేదు. అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. మలయాళంలో ఒక సినిమా చేసాను. ఆ తర్వాత ఈ సినిమా వచ్చింది.

బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసా…

ఈ సినిమా ఒరిజినల్ లో నా క్యారెక్టర్ అమలాపాల్ చేసింది. అమలా అంటే నాకు చాలా ఇష్టం. కళ్ళతో నటించే హీరోయిన్ తను. అమలా.. క్యారెక్టర్ కి బెస్ట్
అనిపించుకుంది. నేను తనతో పోల్చుకోను… కానీ నేను కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశా. కొన్ని సీన్స్ లో నటన పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. రేపు ఆడియన్స్ నా క్యారెక్టర్ ని మెచ్చుకుంటే హ్యాపీ.

ఇది సెకండ్ టైం

రీమేక్ సినిమా చేయడం ఇది సెకండ్ టైం. ‘ప్రేమమ్’ తర్వాత నేను చేసిన రీమేక్ ఇది. ప్రేమమ్ లో ఒరిజినల్ లో నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ తెలుగులోరిపీట్ చేసాను. కానీ ఇది వేరే హీరోయిన్ చేసిన క్యారెక్టర్.. మొదట కొంచెం భయం ఉండేది. నేను సరిగ్గా చేయలేకపోతే ఆడియన్స్ అమలాతో నన్ను కంపేర్ చేస్తారు. అందుకే ఆ కంటెంట్ , సీన్స్ చూసుకొని నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ నటించాను.

పెద్దగా చేంజెస్ లేవు

ఒరిజినల్ కి ‘రాక్షసుడు’ కి పెద్దగా చేంజెస్ లేవు. నేటివిటీలో మాత్రమే చేంజ్ కనిపిస్తుంది. బేసిక్ కంటెంట్, క్యారెక్టర్స్ అన్ని సేం ఉంటాయి. రమేష్ వర్మ గారు ఆ కథను డిస్టర్బ్ చేయలనుకోలేదు. అందుకే మార్పులు చేయకుండానే ఈ సినిమా చేసారు.

ఇదే మొదటిసారి

సినిమాలో చాలా సింపుల్ గా కనిపించే టీచర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. గెటప్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ టైప్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటి సారి. ప్రేక్షకులు నా క్యారెక్టర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారా..? అని టెన్షన్ గా ఉంది.

థ్రిల్లర్స్ … చాలా ఇష్టం

థ్రిల్లర్ సినిమాలంటే చాలా ఇష్టం. సీరియస్ గా సాగే థ్రిల్లర్ సినిమాలను చూడటానికి బాగా ఇష్టపడతాను. ‘రాక్షసుడు’ ద్వారా నాకు నచ్చిన జోనర్ లో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. సినిమా బాగా నచ్చింది పైగా క్యారెక్టర్ కూడా బాగుంది. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను.

స్వీట్ పర్సన్

సాయి చాలా స్వీట్ పర్సన్. సీన్ బాగా వచ్చే వరకూ ఎన్ని రీటేక్స్ అయినా చేస్తాడు. తనలో ఆ క్వాలిటీ బాగా నచ్చింది. సినిమా చాలా తక్కువ టైంలో షూట్ చేసాం. తక్కువ టైంలోనే ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇద్దరం ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో సీరియస్ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేసేసాం.

చాలా జాగ్రత్తలు తీసుకున్నారు

రమేష్ వర్మ గారు పర్ఫెక్షన్ ఉన్న డైరెక్టర్. రాక్షసుడు కి సంబంధించి ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలాజాగ్రత్తలు తీసుకొని సెలెక్ట్ చేసేవారు. స్వీట్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.

చెప్పక తప్పలేదు

సినిమాలో నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఆ టైంలో నా గొంతు సరిగ్గా లేదు. నేను చెప్పలేనన్నా వినకుండా రమేష్ వర్మ గారు నాతోనే చెప్పించారు. గొంతు బాగోకపోయినా చెప్పక తప్పలేదు. నా క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పుకోవడం ఎప్పుడూ ఇష్టమే.

ఇంకా నేర్చుకోవాలనే….

మలయాళంలో దుల్కర్ హీరోగా నటిస్తున్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాను. సినిమా మేకింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాను. హీరోయిన్ గా ఉంటూ సినిమా గురించి పూర్తిగా తెలుసుకోవడం కుదరని పని అందుకే నా మొదటి డైరెక్టర్ ని అడిగి మరీ ఆ సినిమాకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. సినిమాకు వర్క్ చేస్తూ ఫిలిం మేకింగ్ కి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. అదొక మంచి ఎక్స్ పీరియన్స్.

‘అను బ్రో’ అనే వారు

అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు నన్ను ఎవరూ ఒక హీరోయిన్ గా చూడలేదు. అది హ్యాపీ గా ఫీలయ్యాను. సెట్ లో అందరూ ‘అను బ్రో’ అనే వారు. వాళ్ళతోనే కలిసి భోజనం చేసే దాన్ని. వారిలో ఒకరిగా వర్క్ చేసాను.

 

త్వరలోనే చేస్తా

డైరెక్షన్ చేయాలనుంది. కానీ ఇప్పుడే దాని గురించి ఆలోచించను. ఇంకా చాలా టైం పడుతుంది. అన్నీ నేర్చుకున్నాకే మెగా ఫోన్ పడతాను. ప్రస్తుతానికైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయి. త్వరలో వాటిని డెవలప్ చేస్తాను.

 

బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్

నెక్స్ట్ అదర్వ మురళితో కన్నన్ సార్ డైరెక్షన్ లో తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగులో వచ్చిన ‘నిన్ను కోరి’సినిమాకి రీమేక్ అది. అందులో నివేత చేసిన రోల్ చేయబోతున్నాను. ఈ నెల 28 నుండి ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ చేస్తున్నాను(నవ్వుతూ).

 

తెలుగులో రెండు.. 

ప్రస్తుతానికి తమిళ్ సినిమా ఒకటే చెస్తున్నాను. తెలుగులో రెండు సినిమాలొచ్చాయి. త్వరలోనే వాటి డిటైల్స్ చెప్తాను. ఆ ప్రొడక్షన్ హౌజ్ నుండి అనౌన్స్ మెంట్ వస్తుంది.