Anupama Parameswaran - ఫన్నీ ఛిట్ చాట్

Wednesday,April 07,2021 - 03:43 by Z_CLU

ఉన్నట్టుండి సడెన్ గా సోషల్ మీడియాలో లైవ్ లోకొచ్చింది బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. బోర్ కొడుతోందని చెబుతూనే, కాస్త క్రేజీగా ఉండే ప్రశ్నలు అడగండి సమాధానం చెబుతానంటూ ఊహించింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మకు ఎదురైన ప్రశ్నలేంటి.. దానికి ఆమె సమాధానాలేంటి?

– కాసేపు పడుకోవచ్చు కదా?
నేను పడుకుంటే నా కోసం ఎవరు పనిచేస్తారు?

– నీ వయసెంత?
25 ఏళ్లు

– బ్యూటీ సీక్రెట్ ఏంటి?
నిత్యం నవ్వుతూ ఉంటాను.

– ఇలా బోర్ కొడితే ఏం చేస్తావ్?
జనరల్ గా బోర్ కొడితే పెయింటింగ్స్ వేస్తాను. ఇప్పటివరకు చాలా పెయింటింగ్స్ వేశాను

– వరల్డ్ లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి?
ఎప్పుడైనా నా ఫేవరెట్ స్పాట్ నా ఇల్లు. ఇంట్లో ఏం చేయకుండా అలా కూర్చున్నా చాలు.

– బొద్దుగా ఉంటేనే బాగుంటావ్, ఎందుకు సన్నబడ్డావ్?
నిజమే నాక్కూడా అదే అనిపిస్తోంది. అయినా ఇప్పుడిప్పుడే మళ్లీ కాస్త బొద్దుగా మారుతున్నాను. డోంట్ వర్రీ.

– ఇష్టమైన భోజనం
ఇష్టమైన భోజనం బిర్యానీ, మరీ ముఖ్యంగా చికెన్ బిర్యానీ. రెగ్యులర్ గా అయితే రైస్, టమాట పప్పు ఎక్కువగా తింటాను.