అనుపమ రెడీ ఫర్ రేస్

Tuesday,January 10,2017 - 03:02 by Z_CLU

ప్రేమమ్ సినిమాలో చిన్న ఝలక్ తో మెస్మరైజ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ‘శతమానం భవతి’ సినిమాతో మొత్తం కాన్సంట్రేషన్ ని తన వైపు తిప్పుకుంటుంది. ఈ సినిమాలో ఫారిన్ రిటర్న్ గా ఎంట్రీ ఇవ్వనున్న అనుపమ, పల్లెటూరి అమ్మాయిలా… సరికొత్త లుక్ లో మెస్మరైజ్ చేస్తుంది.

ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో మ్యాగ్జిమం స్కోప్ శర్వానంద్, అనుపమల మధ్య నడిచే లవ్ స్టోరీకే ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి…. ఈ మళయాళ కుట్టి ఈ సినిమాతో తెలుగు స్క్రీన్ పై పర్మనెంట్ ప్లేస్ ని సెక్యూర్డ్ చేసుకోవడంతో పాటు, స్టార్ హీరోయిన్ రేస్ కి క్వాలిఫై అయ్యే మ్యాగ్జిమం చాన్సెస్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది.

anupama-parameswaran-latest-hd-stills-31

ఇప్పటికే బడా బడా సినిమాల మధ్య కూడా సైలెంట్ గా తన మార్క్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకున్న శతమానం భవతి సంక్రాంతి పండగ పూట, సరికొత్త సంబరంలా థియేటర్స్ లోకి అడుగుపెడుతుంది.