మళయాళీ బ్యూటీ రెండు సినిమాలతో

Tuesday,March 17,2020 - 11:29 by Z_CLU

‘ప్రేమమ్’, ‘అఆ’, ‘శతమానం భవతి’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న మళయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం రెండు సినిమాలు సైన్ చేసింది. ‘రాక్షసుడు’ సక్సెస్ తర్వాత కొంచెం టైం తీసుకొని రెండు సినిమాలు ఒకే చేసుకుంది అను.

దిల్ రాజు సోదరుడి తనయుడు అశీష్ హీరోగా తెరకెక్కుతున్న ‘రౌడీ బాయ్స్’ సినిమాలో హీరోయిన్ గా నటించనున్న అనుపమ ఓ లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ సినిమా చేయబోతుందని సమాచారం. ఈ రెండు సినిమాలతో మళ్ళీ తెలుగులో బిజీ హీరోయిన్ గా మారాలని చూస్తోంది.

ఈ సినిమాలతో పాటు మరో సినిమాను కూడా సెట్ చేసుకునే పనిలో ఉందట. మరి ఈ మళయాళీ ముద్దుగుమ్మ వీటితో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.