అనూప్ రూబెన్స్ ఇంటర్వ్యూ

Friday,December 29,2017 - 05:19 by Z_CLU

అఖిల్ ‘హలో’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నాడు అనూప్ రూబెన్స్. ఈ సందర్భంగా తన కరియర్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజెస్ ని ఓపెన్ గా మీడియాతో డిస్కస్ చేశాడు. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీ కోసం…

అందరికీ చాలా థాంక్స్…

హలో సినిమాని, మ్యూజిక్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసిన మీ అందరికీ చాలా థాంక్స్…

 

ఇప్పటికీ అదే ఫీలింగ్….

50 సినిమాలు చేశాను అనే ఫీలింగ్ లేదు. కీ బోర్డ్ ప్లేయర్ గా నా కరియర్ బిగిన్ అయింది. చాలా మంది డైరెక్టర్స్ తో పని చేశాను. ఒక్కొక్కరితో పని చేసేటప్పుడు ఒక్కో అనుభవం. ఇంకా చాలా సాంగ్స్ కంపోజ్ చేయాలి, ఇప్పటికీ నా బెస్ట్ ఇవ్వలేదనే ఫీలింగ్ ఉంటుంది.

కాంపిటీషన్ ఉండాలి…

మ్యూజిక్ డైరెక్టర్స్ కి మధ్య కాంపిటీషన్ ఉండటం అనేది మంచిదే అని నా ఫీలింగ్. అలా ఉన్నప్పుడే ఒకరి మ్యూజిక్ ని చూసి మరొకరు ఇంప్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నా వరకు నేను కాంపిటీషన్ అంటే పాజిటివ్ గానే తీసుకుంటాను…

సంతృప్తినిచ్చిన సినిమాలు…

మనం, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, గోపాల గోపాల మూవీస్ చాలా సంతృప్తినిచ్చాయనే చెప్పాలి. అమితాబ్ గారి ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఇంకా ది బెస్ట్.

ప్రెజర్ అయితే బిగినింగ్ నుండి ఉండేది…

‘మనం’ లాంటి క్లాసిక్ హిట్ తరవాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి ‘హలో’ సినిమాలో ప్రెజర్ బిగినింగ్ నుండే ఉంది. విక్రమ్ గారే చాలాసార్లు చెప్పారు. ‘మనం’ సినిమాతో ఒక స్టాండర్డ్ ని సెట్ చేశాము. కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఇస్తే కానీ వర్కవుట్ అవ్వదని ముందు నుండే ట్రై చేశాం…

 

అలా జరిగింది…

అఖిల్ కి న్యాచురల్ గానే మంచి వాయిస్ ఉంది. ఒకరోజు ఏదో హిందీ సాంగ్ హమ్ చేస్తుంటే అడిగాను. అప్పుడు తనకి సింగింగ్ అంటే ఇష్టం కానీ కొంచెం బ్రీతింగ్ లాంటివి చూసుకోవాలి అని చెప్పాడు. అప్పుడే తన చేత పాడించాలని డిసైడ్ అయ్యాను. తను డెడికేటెడ్ గా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఈజీ అయిపోయింది…

అనపూర్ణ కాంపౌండ్ లో బిగిన్ అయ్యానిలా…

అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను చేసిన ఫస్ట్ మూవీ దేవకట్ట గారి డైరెక్షన్ లో వచ్చిన ‘ఆటోనగర్’ సూర్య. నేను బిగినింగ్ లో నితిన్ ‘ద్రోణ’ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆ సినిమా వల్ల ‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ సినిమాల్లో   చాన్స్ దొరికింది. ఆ సినిమా వెంకట్ బ్యానర్ లో వచ్చింది. అలా వెంకట్ గారు నాగార్జున గారికి ఇంట్రడ్యూస్ చేయడంతో బాండింగ్ బిగిన్ అయింది… అందుకు నేను వెంకట్ గారికి, B.A. రాజు గారికి రుణపడి ఉంటాను.

మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటారు….

తమన్ నాకు మంచి ఫ్రెండ్. కరియర్ బిగినింగ్ లో ఇద్దరం కొన్ని సినిమాలకు కలిసి పని చేశాం. DSP కూడా ఎక్కడైనా కలిసినా, వెళ్ళినా ఫ్రెండ్లీగా పలకరిస్తాడు.

నా సాంగ్స్ నేను వినను…

నా సాంగ్స్ ని నేను పాడాలని ఎప్పుడూ అనుకోలేదు. అంతెందుకు నాకు నా పాటలు వినే అలవాటు కూడా లేదు. ఎప్పుడైనా FM లో వింటే, హ్యాప్పీగా ఫీలవుతా, లేకపోతే ఇక్కడ ఇలా చేసి ఉంటే బావుండేది అని ఫీలవుతా…

పూరి జగన్నాథ్ గారు గూగుల్ టైప్..

పూరి జగన్నాథ్ గారి దగ్గర ఎంత నేర్చుకోవాలనుకుంటే అంత నేర్చుకోవచ్చు. అంత నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయనతో నేను హార్ట్ ఎటాక్, టెంపర్ రీసెంట్ గా పైసావసూల్ సినిమాకు పని చేశాను. బుడ్డా హోగా తేరా బాప్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను.

నెక్స్ట్ మూవీస్…

తేజ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారి సినిమా చేస్తున్నాను.

అదే చాలా కష్టం…

సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం కన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం చాలా కష్టం. ప్రతి సీన్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయాలి.