Ram Pothineni 'జాతిరత్నాలు' దర్శకుడితో రామ్ !

Tuesday,October 25,2022 - 02:15 by Z_CLU

Director Anudeep Kv to direct Hero Ram ?

జాతిరత్నాలు సినిమా సక్సెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ తాజాగా ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపావళి స్పెషల్ గా రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా తర్వాత అనుదీప్ ఎవరితో చేస్తాడనే ప్రశ్నకు తాజాగా ఆన్సర్ ఇచ్చాడు. విక్టరీ వెంకటేష్ తో అనుదీప్ సినిమా ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి అనుదీప్ క్లారిటీ ఇవ్వలేదు.

ఇటివల హీరో రామ్ తో కమిట్ మెంట్ ఉందని కథ చెప్పాల్సి ఉందని అనుదీప్ చెప్పుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ , సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్స్ అడ్వాన్సులు ఇచ్చారని తెలిపాడు. మరి అనుదీప్ కథతో అప్రోచ్ అవ్వడమే ఆలస్యం రామ్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ కానుందన్న మాట. మరి ఈ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉంది. అలాగే అనుదీప్ హిందీలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics