45 ఏళ్లు పూర్తిచేసుకున్న మంచివాడు

Thursday,February 21,2019 - 04:22 by Z_CLU

సాత్వికమైన పాత్రలకు పెట్టింది పేరు లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు. ఈ మహానటుడు నటించిన ప్రతి సినిమా ఎంతో విలక్షణం. కథాబలానికి తోడు ఏఎన్నార్ అభినయం సినిమాను అపురూపంగా మార్చేసేది. అలాంటి చిత్రమే 1974లో వచ్చిన మంచివాడు. ఈ మూవీ విడుదలైన ఈరోజుకి సరిగ్గా 45 ఏళ్లు.

మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లెజెండ్ ఏఎన్నార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ గా నిలిచింది. “అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది..” అనే పాట ఈ సినిమాలోనిదే. కేవీ మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మూవీ – మంచివాడు
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, కాంచన, రాజబాబు, రమాప్రభ, హలం, రమోలా, పీజే.శర్మ, వైవీ రాజు, ఇందిర,
ఇంద్రాణి, తిలకం, ఏఎల్.నారాయణ, మాడా వెంకటేశ్వరరావు, పెమ్మసాని రామకృష్ణ
అతిథినటులు : పద్మనాభం, సత్యనారాయణ, బాలకృష్ణ
బ్యానర్ – వీనస్ కంబైన్స్
నిర్మాత: టి.గోవిందరాజన్
దర్శకుడు:వి.మధుసూదనరావు
సంగీతం: కేవీ మహదేవన్
నృత్యం: హీరాలాల్, సుందరం
కథ: పీ.కృష్ణన్
మాటలు: ఆత్రేయ
పాటలు: ఆత్రేయ, దాశరథి, సి. నారాయణరెడ్డి
నేపథ్యగానం: ఘంటసాల, సుశీల, ఎం.రామారావు
ఛాయాగ్రహణం: పీ .సెల్వరాజ్
కళ: ఎస్. కృష్ణారావు
కూర్పు: కే సత్యం
పోరాటాలు: మాధవన్