రాజమౌళికి ANR నేషనల్ అవార్డు.

Friday,September 08,2017 - 06:08 by Z_CLU

అక్కినేని నాగేశ్వరావు గారి జ్ఞాపకార్ధం ANR నేషనల్ అవార్డు పేరిట ప్రతీ ఏడాది సినీ రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ని అక్కినేని కుటుంబం సన్మానిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ANR నేషనల్ అవార్డు గ్రహీత రాజమౌళి గా ప్రకటించాడు నాగ్.

గతేడాది అమితాబ్ కు అవార్డు ప్రధానం చేసిన అక్కినేని కుటుంబం ఈ ఏడాది బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి ను ప్రశంసించి ఈ అవార్డును అందించబోతున్నారు. సెప్టెంబర్ 17 న  శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగనున్న వేడుకలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకోనున్నాడు జక్కన్న.