బాలయ్య సినిమా కోసం మరో పవర్ ఫుల్ టైటిల్

Thursday,July 06,2017 - 09:02 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 వ సినిమా ‘పైసావసూల్’ లో నటిస్తున్న నందమూరి బాలయ్య ఈ సినిమాను ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చాడు. ప్రస్తుతం తన 102వ సినిమా పై ఫోకస్ పెట్టాడు. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో సి.కళ్యాణ్ నిర్మాణంలో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమా.. టైటిల్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

మొన్నటివరకు ఈ సినిమాకు ‘రెడ్డిగారు’ అనే టైటిల్ పెడతారంటూ వార్తలొచ్చాయి. ఈమధ్య ‘జయసింహ’ అనే మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. తాజాగా మరో టైటిల్ వినిపిస్తుంది.

బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాకు రూలర్ అనే టైటిల్ ను పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్-బోయపాటి సినిమా కోసం ఇదే పేరును పరిశీలించారు. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం మరోసారి ఈ పేరు తెరపైకి రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది.