నిహారిక ‘హ్యాప్పీ వెడ్డింగ్’ నుండి మరో సర్ ప్రైజ్

Wednesday,July 18,2018 - 02:02 by Z_CLU

రేపు మార్నింగ్ 9 గంటలకు నిహారిక, సుమంత అశ్విన్ జంటగా నటించిన ‘హ్యాప్పీ వెడ్డింగ్’ సినిమా నుండి మరో టీజర్ రిలీజవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్  తో పాటు సాంగ్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. అయితే వాటికి తోడు రేపు ‘చలువ’ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో భారీ క్రేజ్ క్రియేట్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా చుట్టూ మరింత క్యూరియాసిటీ రేజ్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు.

లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. UV క్రియేషన్స్ బ్యానర్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28 న ఈ సినిమా రిలీజవుతుంది.