కోలీవుడ్ బ్యూటీకి మరో సూపర్ హిట్

Sunday,February 05,2017 - 10:08 by Z_CLU

కోలీవుడ్ టూ టాలీవుడ్ అనే టాగ్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ టైంలోనే భారీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రెజెంట్ టాలీవుడ్ కి మరో లక్కీ హీరోయిన్ గా మారింది. లాస్ట్ ఇయర్ ఈ అమ్మడు నటించిన ‘నేను శైలజ’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో నాని హీరోగా నేను లోకల్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా కూడాా హిట్ అవ్వడంతో టాలీవుడ్ ఫోకస్ కీర్తి వైపు మళ్లింది.

ఇప్పటికే పవర్ స్టార్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసిన ఈ కోలీవుడ్ భామ… ప్రెజెంట్ తమిళ్ తో పాటు తెలుగుపై కూడా ఫోకస్ పెడుతూ టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ అందుకోవాలని చూస్తోంది. ప్రెజెంట్ ‘నేను లోకల్’ మంచి కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండడం, మరోసారి తన  నేచురల్  పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్లస్ అవ్వడంతో   ఈ అమ్మడికి బడా ఆఫర్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.