మెగా హీరో కోసం మరో స్టార్ హీరో....

Saturday,February 04,2017 - 11:26 by Z_CLU

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ‘విన్నర్’. ఫిబ్రవరి 24 న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రెజెంట్ సోషల్ మీడియాలో సాంగ్స్ తో హంగామా చేస్తుంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకొని యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధిస్తుండగా మరో సాంగ్ తో ఆ హంగామాను కంటిన్యూ చేయడానికి రెడీ అవుతున్నాడు తేజ్.

sai-dharam-tej-winner

ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను మహేష్ తో రిలీజ్ చేయించిన టీం రెండో సాంగ్ ను కూడా మరో స్టార్ హీరోతో సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయించాలని చూస్తున్నారట. అయితే ఈ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసే ఆ స్టార్ ఎవరా అనేది మాత్రం ప్రెజెంట్ సస్పెన్స్ అంటున్నారు యూనిట్. మరి ఈ సాంగ్ ను రిలీజ్ చేసే మరో స్టార్ హీరో ఎవరో అనేదాని పై మెగా ఫాన్స్ లో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది…..