బుల్లితెరపై సంచలనం ..మరి కొన్ని గంటల్లో ..!

Friday,September 02,2016 - 01:00 by Z_CLU

 దిల్ పై సూపర్ హిట్ అంటూ పసందైన సినిమాలతో మరి కొన్ని   గంటల్లోనే  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘జీ సినిమాలు’ ఛానల్. ఈ సందర్భంగా ‘సరైనోడు’ లో సాంబార్ పేరుతో స్టార్ ఇమేజ్ అందుకొని నటి గా దూసుకుపోతున్న విధ్యులేక “హాయ్ నా పేరు బుజ్జి నాకు లైఫ్ లో ఇష్టమైనవి రెండే రెండు ఒకటి ‘ఫుడ్’ రెండు ‘సినిమా’ “అంటూ చేసిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది.

 

అలాగే మెట్రో పిల్లర్స్ పై ‘ప్రతి ఇల్లు సినిమాలే’, ‘దిల్ కి నచ్చిందే అసలైన సూపర్ హిట్’ అంటూ హోర్డింగులు కూడా అందరిని ఆకట్టుకుంటూ జీ సినిమాలు ఛానల్ ఎప్పుడెప్పుడొస్తుందా? అనే ఆతృతను ప్రేక్షకుల్లో కలిగిస్తున్నాయి.

Habsiguda station to Tarnaka

ఇటీవలే మెగా స్టార్ చేతుల మీదుగా క్లాప్ అందుకున్న జీ సినిమాలు ఛానల్ సెప్టెంబర్ 4 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. సరికొత్త వెలుగు అనే క్యాప్షన్ ను నిజం చేస్తూ, తెలుగునాట జీ-తెలుగు ఛానెల్ నంబర్ వన్ ఛానెల్ గా అవతరించి విజయవంతంగా 11 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది… మరోసారి తెలుగు ప్రజల హృదయాల్ని గెలుచుకునేందుకు, వాళ్ల మనసుల్లో సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకునేందుకు… ‘జీ-సినిమాలు’ పేరుతో సరికొత్త పూర్తిస్థాయి మూవీ ఛానెల్ ను తీసుకొస్తోంది.

DSC_9935

 

తెలుగు స్టార్స్ ను దేవుళ్లుగా భావించే ప్రేక్షకుల కోసం, దిల్ పై సూపర్ హిట్ అనే సరికొత్త పొజిషనింగ్ తో, ఇంటర్నేషనల్ ఏజన్సీలు రూపొందించిన హై-ఫై లుక్ తో సిద్ధమైంది మీ జీ-సినిమాలు ఛానెల్. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త అనుభూతులు-ఆస్వాదనలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిస్థాయి సినిమా ఛానెల్ గా జీ-సినిమాలు సిద్ధమైంది. తెలుగు టీవీ రంగంలోనే తొలిసారిగా… మూవీ ఛానెల్ తో పాటు తెలుగు-ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి వెబ్ సైట్ ను తీసుకొచ్చి… టాలీవుడ్ కు చెందిన లేటెస్ట్ అప్ డేట్స్, బాక్సాఫీస్ వివరాలు, సమీక్షలు లాంటి సమస్త సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది జీ-సినిమాలు.

 

Zee CInemalu Launch Creative 3

దక్షిణాది టెలివిజన్ రంగంలోనే తొలిసారిగా “7 డే – 7 ప్రీమియర్” లను జీ-సినిమాలు ఛానెల్ లో మాత్రమే చూడొచ్చు. వీటితోపాటు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, మూవీ ఆఫ్ ది మంత్ లాంటి ఎన్నో ఎట్రాక్షన్స్ జీ-సినిమాలు సొంతం. బ్రహ్మోత్సవం, అఖిల్, కుమారి-21ఎఫ్, సుప్రీమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు త్వరలోనే మీ జీ-సినిమాలు ఛానెల్ లో కనువిందు చేయబోతున్నాయి.

Zee CInemalu Launch Creative 2

 

జీ సినిమాలు ప్రసారాలు ఇప్పుడు DTHలో కూడా అందుబాటులోకి వచ్చాయి. DISH TV, TATASKY, AIRTEL, RELIANCEలో జీ సినిమాలు ఛానెల్ ను చూసి ఆనందించండి.