మరో రొమాంటిక్ సాంగ్ తో...

Friday,December 09,2016 - 10:00 by Z_CLU

మరో సారి తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు… రొమాంటిక్ సాంగ్ మేకింగ్ లో కింగ్ అనే బిరుదు అందుకున్న దర్శకేంద్రుడు మరోసారి ఓ రొమాంటిక్ సాంగ్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు.

ragha-vendra-rao-song-shoot

ప్రస్తుతం నాగార్జున హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవోషనల్ మూవీ ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ సినిమాలో నాగార్జున- ప్రగ్య జైస్వాల్ కి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ సినిమాకు స్పెషల్ హైలైట్ గా నిలవనుందట. ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ సాంగ్స్ తో ఎంటర్టైన్ చేసిన రాఘవేంద్రరావు-కీరవాణి కాంబినేషన్ లో రానున్న ఈ పాట వినసొంపుగా ఉండటం తో పాటు కనిపివిందు చేస్తుందట.

ragha-vendra-rao-song
ఈ సాంగ్ విషయం లో  చాలా కేర్ తీసుకున్నారట రాఘవేంద్ర రావు. దాదాపు 40 వేల దీపాలు, పళ్ళు , అందమైన సెట్ ఈ సాంగ్ లో ప్రత్యేకంగా కనిపిస్తాయట.మరి గతం లో పలు రొమాంటిక్  సాంగ్స్ తో ఎంటర్టైన్ చేసిన రొమాంటిక్ హీరో నాగార్జున రొమాంటిక్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ పాట థియేటర్ లో మరో సారి అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాకు స్పెషల్ హైలైట్ గా నిలవడం ఖాయం అంటున్నారు సినిమా యూనిట్.