బాహుబలి అకౌంట్ లో మరో బెస్ట్ రికార్డ్

Wednesday,April 26,2017 - 05:35 by Z_CLU

బాహుబలి రూట్ లో వచ్చిన ప్రతి రికార్డ్ బ్రేక్ అయింది. ఇప్పుడీ రికార్డ్ బ్రేకింగ్ పరంపరని కెనడాలోను  కొనసాగిస్తుంది బాహుబలి 2. 785 మంది కూర్చుని ఒకేసారి చూడగలిగే కెనడియన్ బెగ్గెస్ట్ థియేటర్ మోంట్ రియల్, క్యూబెక్ థియేటర్ లోను ప్రదర్శించబడుతున్న ఈ సినిమా, ఏకంగా నాలుగు భాషల్లో రిలీజవుతుంది. ఇది ఓవర్ సీస్ హిస్టరీ లోనే ఫస్ట్ టైం.

టొరంటో లోని ఆల్ బియన్ వుడ్ సైడ్ మరియు యార్క్ సినిమాస్ లో మొత్తం 11 స్క్రీన్స్ లో 30 ప్రీమియర్ షోస్ ప్రదర్శించనున్నాయి. దానికి తోడు ఈ సినిమాకి క్రియేట్ అయిన హై డిమాండ్ ని మైండ్ లో పెట్టుకుని కొన్ని కార్పోరేట్స్, ప్రైవేట్ గ్రూప్స్ కోసం స్పెషల్ గా స్క్రీనింగ్ జరగనుంది.

కెనడాలో ఎన్నిసినిమాలు రిలీజైనా ఏ సినిమాకి ఇప్పటి వరకు ప్రమోషన్స్ జరగలేదు. కానీ బాహుబలి ఆ ఆచారాన్ని కూడా బ్రేక్ చేసేసింది. ఫస్ట్ టైం ఒకిందియన్ సినిమాకి కెనడాలో ప్రమోషన్స్ జరిగాయి. దానికి తోడు ఈ సినిమా గురించి కెనడియన్ బాలీవుడ్ మ్యాగజైన్ ప్రస్తావించడం విశేషం.