మరో రికార్డు సెట్ చేసిన ధృవ

Sunday,December 04,2016 - 01:15 by Z_CLU

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ధృవ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ధృవ…. ట్రయిలర్ తో ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా యూట్యూబ్ లో మరో సంచలనం సృష్టించింది. విడుదలైన నాలుగున్నర గంటల్లోనే 10లక్షల వ్యూస్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పిన ధృవ… తాజాగా 50లక్షల క్లబ్ లోకి ఎంటరైంది. అవును.. యూబ్యూట్ లో ఈ సినిమా ట్రయిలర్ ను 50లక్షల మందికి పైగా వీక్షించారు. ఇంత తక్కువ టైమ్ లో ఓ టీజర్ ను ఇంతమంది చూడ్డం.. టాలీవుడ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.

ఇలా భారీ అంచనాల్ని క్రియేట్ చేసిన ధృవ సినిమా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకొని, సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది ధృవ సినిమా. ప్రస్తుతం ఇతర దేశాలకు ప్రింట్స్ పంపే పనిలో టీం బిజీగా ఉంది. ఈ సినిమా ప్రచారం కోసం రామ్ చరణ్ ఈసారి ప్రత్యేకంగా అమెరికా కూడా వెళ్లబోతున్నాడు.