మరో సినిమా స్టార్ట్ చేసిన పవన్

Friday,December 16,2016 - 10:46 by Z_CLU

పవన్ ఇప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు రాజకీయ వ్యవహారాలు కూడా చూసుకుంటున్న పవన్… రాబోయే ఎన్నికల్లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే కాటమరాయుడును సెట్స్ పైకి తీసుకొచ్చి, మరో రెండు సినిమాలకు కొబ్బరికాయలు కూడా కొట్టాడు. వీటిలో త్రివిక్రమ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చురుగ్గా సాగుతోంది. హీరోయిన్ల ఎంపిక కూడా పూర్తయింది. ఇప్పుడు నేసన్ సినిమా కూడా ప్రారంభమైంది.

pawan-kalyan-thaman-neason-movie-2

టీఎన్ నేసన దర్శకత్వంలో, ఏఎం రత్నం సమర్పణలో పవన్ ఓ సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పుడు ప్రారంభమయ్యాయి. మ్యూజిక్ డైరక్టర్ తమన్, ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు. పవన్ కోసం ఫస్ట్ టైం వర్క్ చేస్తున్న ఈ కుర్ర కంపోజర్… అదిరిపోయే ట్యూన్స్ తో పవర్ స్టార్ ను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయనే విషయాన్ని తమన్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు.