ఈసారి ఇంకాస్త స్టయిల్ గా...

Friday,September 30,2016 - 02:01 by Z_CLU

చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఖైదీ నంబర్-150. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టైటిల్ ఎనౌన్స్ చేయడంతో పాటు నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తవ్వడంతో.. సినిమా షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం జరుగుతున్నాయి. టీజర్ తో పాటు తాజాగా విడుదలైన 2 స్టిల్స్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచాయి. ఇప్పుడు చిరంజీవి స్టిల్స్ తో పాటు… ఖైదీ నంబర్-150లో విలన్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

ctledj_usaacfpv123

ఇదిగో ఇతడే ఖైదీ నంబర్-150లో విలన్. పేరు తరుణ్ అరోరా. ఒకప్పుడు చిరు సరసన మెరిసిన అంజలా ఝవేరీ భర్తే ఈ తరుణ్ అరోరా. ప్రతిష్టాత్మక ఖైదీ నంబర్-150లో విలన్ పాత్ర పోషించే లక్కీ ఛాన్స్ అందుకున్నాడు తరుణ్. సినిమాలో తరుణ్ పాత్ర… బడా వ్యాపారవేత్త విజయ్ మాల్యాను పోలి ఉంటుందనే గాసిప్ ఇప్పటికే నడుస్తోంది. ఈ గాసిప్ కు తగ్గట్టే… తరుణ్ అరోరా గెటప్ విజయ్ మాల్యాను పోలి ఉంది.