RC15 లో ఆ హీరో కూడా ?

Friday,April 09,2021 - 12:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ అయినప్పటి నుండి #RC15 చుట్టూ రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఓ కీ రోల్ ఉందని, దాన్ని శంకర్ ఓ స్టార్ హీరోతో చేయించబోతున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఆ రోల్ కి  ముందుగా కన్నడ స్టార్ హీరో యష్ పేరు వినిపించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఇలా ఒక్కొక్కరి పేరు చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఫైనల్ గా ఆ రోల్ చేయబోతుంది సల్మాన్ ఖాన్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. సినిమాలో సల్మాన్ ఓ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని అంటున్నారు.

salman-playing-an-interesting-role-in-rc15-gossip-zeecinemalu

ఉన్నట్టుండి సల్మాన్ పేరు తెరపైకి రావడానికి  ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. రామ్ చరణ్ కి సల్మాన్ ఖాన్ మంచి ఫ్రెండ్. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సల్మాన్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చరణ్ ని కలిసి టైం స్పెంట్ చేస్తాడు. ఆ చనువుతోనే చరణ్ సల్లూ బాయ్ కి ఈ రోల్ సజిస్ట్ చేశాడని చరణ్ రిక్వెస్ట్ పైగా శంకర్ సినిమా కావడంతో సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమా జులై నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం భారీ సెట్ వర్క్ జరుగుతుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శంకర్ – రామ్ చరణ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

Also Read ‘పుష్ప’ టీజర్ రివ్యూ

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics