మరో సక్సెస్ అందుకున్న థమన్ !

Friday,April 19,2019 - 04:26 by Z_CLU

సినిమాకు సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ గా బెస్ట్ అనిపించుకున్నాడు థమన్. ఇటివలే ‘మజిలీ’కి మంచి ఆర్.ఆర్ అందించి విజయంలో పాలుపంచుకున్న థమన్ ఇప్పుడు మరో విజయంలో భాగం అయ్యాడు. లారెన్స్ హీరోగా నటించిన ‘కాంచన3’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు థమన్. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమాలో కామెడీ సీన్స్ , హార్రర్ సీన్స్ తో పాటు థమన్ అందించిన రీ రికార్డింగ్ హైలైట్ గా నిలిచింది. సినిమాలో బలమైన సన్నివేశాలకు తన మ్యూజిక్ తో ఇంకాస్త బలం చేకూర్చాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా చూసిన ప్రేక్షకులు ఇప్పటికే థమన్ మ్యూజిక్ హైలైట్ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సో ‘కాంచన 3’ తో మ్యూజిక్ డైరెక్టర్ గా మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు థమన్.