రామ్ శంకర్ కెరీర్ లో మరో సక్సెస్

Friday,March 17,2017 - 10:02 by Z_CLU

కెరీర్ స్టార్టింగ్ లో పూరి జగన్నాధ్ తమ్ముడు మాత్రమే. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రామ్ శంకర్ ఓ హీరో. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదిగిన రామ్ శంకర్… తన మార్క్ మేనరిజమ్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా నేనో రకం సినిమాతో థియేటర్లలోకి వచ్చిన రామ్ శంకర్.. మరో సక్సెస్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

నిజానికి ఈ సినిమా బాగుందనే టాక్ 3 రోజుల కిందటే బయటకు వచ్చింది. ఎందుకంటే, మీడియా కోసం రిలీజ్ కు ముందే ఈ సినిమాను ప్రదర్శించారు మేకర్స్. అలా మంచి మౌత్ టాక్ తో రిలీజైైంది ‘నేనోరకం’ సినిమా. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బడా సినిమాలేవీ లేవు. మరోవైపు నేనో రకం సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవడానికి రామ్ శంకర్ కు ఇక ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. మరి ఈ సినిమాతో రామ్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాడో..చూడాలి…