ఈ వీకెండ్ మరో చరిత్ర

Tuesday,May 16,2017 - 11:43 by Z_CLU

రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 ఈ వీకెండ్ కల్లా మరో చరిత్రను సృష్టించే దిశగా పరుగులు పెడుతుంది. రిలీజైన 18 రోజుల్లోనే జస్ట్ ఇండియాలోనే 910 కోట్ల షేర్, 1, 168 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిన బాహుబలి 2, ఓవర్సీస్ లో ఏకంగా 257 ఓట్ల గ్రాస్ వసూలు చేసి ఓవరాల్ గా 1,425 కోట్లను బ్యాగ్ లో వేసుకుంది.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఇమాజినేషన్ కి కూడా రీచ్ అవ్వని హైట్స్ ని అందుకున్న బాహుబలి 2 రానున్న వీకెండ్ కల్లా 1500 కోట్లు దాటి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. విజువల్ వండర్ గా తెరకెక్కి హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అంతే స్ట్రెంత్ తో ప్రదర్శించబడుతుంది.