చైతు సరసన ఇస్మార్ట్ బ్యూటీ !

Saturday,March 20,2021 - 10:10 by Z_CLU

ఇటివలే ‘లవ్ స్టోరి’ సినిమాకు సంబంధించి షూట్ ఫినిష్ చేసిన నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘ThankYou’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రీ ఫేజెస్ ఆఫ్ లవ్ స్టోరీస్ తో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక ఒక హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా చైతూ -మాళవిక లవ్ ట్రాక్ ను నిడదవోలు పరిసర ప్రాంతంలో షూట్ చేసిన యూనిట్ త్వరలోనే మరో లవ్ స్టోరీ పార్ట్ షూట్ చేయబోతున్నారు.

ఆ లవ్ ట్రాక్ లో చైతూ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. తాజాగా డైరెక్టర్ విక్రమ్ కుమార్  నభాని సంప్రదించి ఆమెకి స్క్రిప్ట్  వినిపించాడట. త్వరలోనే చైతు -నభా లవ్ ట్రాక్ కి సంబంధించి షూట్ జరగనుంది. మరో హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసి ఆమెతో ఓ లవ్ ట్రాక్  తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. మూడు లవ్ ట్రాక్స్ తో రూపొందుతున్న ఈ సినిమా  ‘నా ఆటోగ్రాఫ్’ తరహాలో ఉంటుందని టాక్.