వెంకీ సినిమాకు మరో హీరోయిన్ ఫిక్స్

Sunday,March 04,2018 - 09:03 by Z_CLU

తేజ దర్శకత్వం వెంకటేష్ నటిస్తున్న సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఇటివలే ఈ సినిమాకు హీరోయిన్ గా శ్రియని తీసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఈషా రెబ్బ ని ఫైనల్ చేసారట మేకర్స్. లేటెస్ట్ గా అ! లో నటించిన ఈ అమ్మడు నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదే అని సమాచారం. మరి ఈ సినిమాలో ఈషా ను తేజ  ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తాడో..చూడాలి

నారా రోహిత్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు