ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్ ఫిక్స్

Friday,April 21,2017 - 06:07 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న భారీ సినిమా ‘జై లవ కుశ’.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది.. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ గా రాశి ఖన్నా తో పాటు నివేత థామస్ ను కూడా తీసుకున్న మేకర్స్ లేటెస్ట్ గా నందిత రాజ్ మరో హీరోయిన్ గా తీసుకున్నారు..

ఇక ‘ప్రేమ కథ చిత్రం’,’లవర్స్’,’సావిత్రి’ సినిమాలతో హీరోయిన్ గా మంచి ఇమేజ్ తో పాటు పెర్ఫార్మర్ గా గుర్తింపు అందుకున్న నందిత ఎన్టీఆర్ సరసన ఎలా కనిపిస్తుందో.. ఏ గెటప్ లో కనిపిస్తుందో.. తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..
ప్రస్తుతం తారక్ సరసన నటించే ఛాన్స్ రావడంతో ఫుల్ ఖుషి లో ఉన్న ఈ భామ త్వరలోనే ‘జై లవకుశ’ సెట్ లో హంగామా చేయబోతుంది..