పూరి లిస్ట్ లో ఆ హీరో కూడా

Saturday,April 01,2017 - 09:00 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే పూరి ప్రస్తుతం నందమూరి బాలయ్యతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా ఫినిష్ చేసిన పూరీ అక్టోబర్ వరకూ ఈ సినిమాను పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. మరి బాలయ్య సినిమా తర్వాత పూరీ ఏ హీరోతో సినిమా చేస్తాడా..అనే డౌట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..


ఇప్పటికే పూరీ నెక్స్ట్ హీరోల లిస్ట్ లో చిరంజీవి, మహేష్, వెంకటేష్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళతో పాటు పూరీ లిస్ట్ లో మరో హీరో కూడా ఉన్నాడట. ఆ హీరో మరెవరో కాదు ఇషాన్ అని ఇన్సైడ్ టాక్. ‘రోగ్’ సినిమాతో ఇషాన్ ను హీరోగా పరిచయం చేసిన పూరీ ఇషాన్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే టాక్ గట్టి గా వినిపిస్తుంది.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూరీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసాడని బాలయ్య సినిమా తరువాత ఇషాన్ తోనే సినిమా ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతుంది. . మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..