ప్రగ్యా లిస్ట్ లో మరో సినిమా ....

Tuesday,May 02,2017 - 12:00 by Z_CLU

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కంచె తో గుర్తింపు అందుకొన్న ప్రగ్యా జైస్వాల్  ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రెజెంట్ నక్షత్రం సినిమాతో పాటు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది..


జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వం లో విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా నటించబోతుంది ప్రగ్యా..లేటెస్ట్ గా మంచు మనోజ్ తో గుంటూరోడు లో జత కట్టిన ఈ అమ్మడు  ఇప్పుడు ఈ సినిమాతో విష్ణు తో కలిసి నటించడానికి రెడీ అవుతుంది.. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 5 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది…హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ అనంతరం అమెరికా లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.