అఖిల్ సినిమాలో మరో ఎగ్జైటెడ్ ఎలిమెంట్

Wednesday,April 19,2017 - 05:48 by Z_CLU

అఖిల్ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తన రెండో సినిమాలో మ్యూగ్జిమం క్రేజీ ఎలిమెంట్స్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ బాబ్ బ్రౌన్ తో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తుంది. ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో క్రేజీ ఎలిమెంట్ కూడా ఉంది.

హైదరాబాద్ మెట్రో ఇంకా ఆక్టివ్ కూడా కాలేదు అప్పుడే అఖిల్, విక్రమ్ సినిమా యూనిట్ మెట్రో లో సక్సెస్ ఫుల్ గా షూటింగ్ జరుపుకున్నారు. అంతేకాదు హైదరాబాద్ మెట్రోలో షూటింగ్ జరుపుకున్న ఫస్ట్ సినిమా యూనిట్ కూడా ఇదే కావడం విశేషం. ఆ విషయాన్ని అంతే ఎగ్జైటెడ్ గా ట్వీట్ చేశాడు అఖిల్.