NBK 102 రేస్ లో మరో బడా డైరెక్టర్

Tuesday,March 07,2017 - 11:47 by Z_CLU

NBK 101 గ్రౌండ్ వర్క్ బిగిన్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రేపో మాపో సెట్స్ పైకి రానున్న ఈ సినిమా కోసం ఓ వైపు సినిమా యూనిట్ బిజీ బిజీగా ఉంది, మరో వైపు బాలయ్య 102 కోసం హై ఎండ్ కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది.

పూరి జగన్నాథ్ కన్నా ముందు 101 సినిమా కోసం కృష్ణవంశీ పేరు వినిపించినా ఇప్పటి వరకు అది అఫీషియల్ గా కన్ఫం చేసే స్టేజ్ కి రాలేదు. ఈ లోపు ఆ లక్కీ చాన్స్ పూరి కొట్టేశాడు. అలాగని బాలయ్య నెక్స్ట్ సినిమా అకౌంట్ లోంచి కృష్ణవంశీ పూర్తిగా బయటికి వచ్చాడా అంటే అదీ లేదు. పూరి తరవాత బాలయ్య నెక్స్ట్ సినిమా కృష్ణవంశీ డైరెక్షన్ లోనే అని ఓ స్ట్రాంగ్ టాక్ టాలీవుడ్ లో ఇంకా నడుస్తూనే ఉంది. ఈ లోపు ఈ స్పేస్ లో ఇంకో డైరెక్టర్ పేరు వచ్చి చేరింది.

బాలయ్య 102 బోయపాటి శ్రీను కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ హిట్ కాంబినేషన్ కి ఫ్యాన్స్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంది. మళ్ళీ ఈ కాంబో అనగానే చిన్న సైజు వైబ్రేషన్ కామనే అయినా, బాలయ్య మైండ్ లో ఎగ్జాక్ట్ గా ఏం నడుస్తుందో ప్రస్తుతానికయితే సస్పెన్సే. ఇప్పటికైతే పూరి మార్క్ స్టైలిష్ మాస్ లుక్ తో ఎంటర్ టైన్ చేయడానికి సీరియస్ ప్రిపరేషన్ లో ఉన్నాడు బాలయ్య .