మెగాస్టార్ ఖాతాలో మరో డైరెక్టర్

Wednesday,January 25,2017 - 04:14 by Z_CLU

మెగాస్టార్ కం బ్యాక్ ఫిలిం క్రియేట్ చేసిన క్రేజ్ జస్ట్ ఒక్క సినిమాతో తగ్గే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు.  150 తరవాత 151 ఎప్పుడు…? ఎవరితో..? అని ఫ్యాన్స్ లో రేజ్ అవుతున్న క్వశ్చన్ బ్యాంక్ కి అఫీషియల్ గా ఏ ఆన్సర్ దొరకలేదు.

నిన్న మొన్నటి వరకు మెగాస్టార్ 151 వెంచర్ చుట్టూ పక్కలా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో పాటు బోయపాటి శ్రీను పేర్లు వినిపించేవి. ఈ ఇద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారా..? అని బుర్రకు పదును పెట్టుకునే టైం లో, ఈ 151 లిస్టులో ఇంకో డైరెక్టర్ పేరు కూడా చేరిపోయింది. అదే సుకుమార్.

ప్రస్తుతం చెర్రీ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొస్తున్న సుక్కు, ఈ మాత్రం దొరికిన గ్యాప్ లో  మెగాస్టార్ ఫ్లాట్ అయిపోయే రేంజ్ లో స్టోరీ చెప్పి, ఇంప్రెస్ చేశాడట. దీంతో చిరు కూడా ఈ సినిమా చేసేస్తున్నాం సుక్కు అని కన్ఫర్మేషన్ కూడ ఇచ్చేశాడట. దీంతో సురేందర్ రెడ్డి, బోయపాటి పక్కన సుక్కు కూడా చేరిపోయాడు. ఫైనల్ గా ఈ ముగ్గురిలో ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.