మహేష్ బాబు ఖాతాలో మరో దర్శకుడు

Tuesday,February 12,2019 - 01:43 by Z_CLU

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ ఇద్దరు దర్శకుల్ని పక్కనపెడితే లిస్ట్ లో అదనంగా మరో ముగ్గురు డైరక్టర్లు వెయిటింగ్ లో ఉన్నారు.

అర్జున్ రెడ్డితో పాపులర్ అయిన ఈ దర్శకుడికి వెంటనే ఆఫర్ ఇచ్చాడు మహేష్. మంచి క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ తెస్తే సినిమా చేద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. వీళ్లిద్దరి మీటింగ్ ఎరేంజ్ చేసిన ఘనత నమ్రతకే దక్కుతుంది. ఇద్దరూ కలిసి 2సార్లు చర్చించుకున్నారు. అంతలోనే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ కు వెళ్లాడు సందీప్ రెడ్డి.

ఈమధ్య కాలంలో బాగా నలిగిన కాంబో ఇది. ఎఫ్-2 సక్సెస్ అవ్వడంతో అనీల్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్న మహేష్, మరో హిలేరియస్ స్క్రిప్ట్ తో వస్తే సినిమా వర్కవుట్ చేద్దామంటూ ఆఫర్ ఇచ్చేశాడు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి స్టోరీ బాగుంటే తనే ప్రొడ్యూస్ చేస్తానని కూడా చెప్పాడట.

పైన చెప్పుకున్న 2 కాంబోలు ఇంకా నలుగుతూనే ఉన్నాయి. అంతలోనే తెరపైకి వచ్చింది ఈ కాంబినేషన్. అవును.. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గాసిప్ ఇది. మహేష్ కు తరుణ్ భాస్కర్ అద్దిరిపోయే లైన్ చెప్పాడట. డెవలప్ చేయమని మహేష్ చెప్పాడట.

 ఇప్పుడు నడుస్తున్న షెడ్యూల్స్ పరంగా చూసుకుంటే.. వచ్చే ఏడాది వరకు మహేష్ ఫ్రీ అవ్వడు. అప్పుడు ఈ ముగ్గుర్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.