సుకుమార్ రైటింగ్స్ నుండి మరో డైరెక్టర్

Tuesday,January 22,2019 - 01:50 by Z_CLU

సుకుమార్ రైటింగ్స్ నుండి ఇప్పటికే కొంత మంది దర్శకులు టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా ఈ బ్యానర్ నుండే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు కూడా ఇదే బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు.

సుకుమార్ దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న కాశి విశాల్ సుకుమార్ రైటింగ్స్ లో తెరకెక్కనున్న సినిమా ద్వారా మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించనున్నాడు. ఈరోజు నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా దర్శకుడితో కలిసి సోషల్ మీడియాలో  శౌర్య కి విషెస్ తెలిపాడు సుకుమార్.

ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానుంది. మార్చ్ నుండి సెట్స్ పైకి వచ్చే చాన్స్ ఉంది. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.