‘NTR’ నుండి మరో క్లాసిక్ పోస్టర్

Monday,November 05,2018 - 06:31 by Z_CLU

దీపావళి కానుకగా NTR బయోపిక్ నుండి మరో పోస్టర్ రిలీజయింది. ‘గుండమ్మకథ’ సినిమాలోని ‘లేచింది నిద్ర లేచింది’ సాంగ్ లోని స్టిల్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ పోస్టర్ లో సావిత్రి గెటప్ లో ఉన్న నిత్యామీనన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది.

ఈ పోస్టర్ ని చూసీ  చూడగానే ‘గుండమ్మ కథ’ సినిమాలోని స్టిల్ అనిపించేంతలా మెస్మరైజ్ చేస్తుంది ఈ పోస్టర్. సావిత్రిలా నిత్యామీనన్ పర్ఫెక్ట్ చాయిస్,  ఇందులో అనుమానం  కూడా    లేదు.  దానికి తోడు బాలయ్య NTR లా మరో కొత్త గెటప్ లో అదుర్స్ అనిపించుకుంటున్నాడు.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది NTR బయోపిక్. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఎన్టీఆర్-కథానాయకుడు చిత్రాన్ని, రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24 న ఎన్టీఆర్-మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాని సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్ ఇందూరి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.