ఈసారి కూడా పోటీ తప్పదా..?
Tuesday,September 27,2016 - 02:41 by Z_CLU
భారీ అంచనాల మధ్య అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాహుబలి కంక్లూజన్ కి ఈ సారి కూడా పోటీ తప్పేలా లేదు. సినిమా అనౌన్స్ చేసి చేయగానే స్టోరీ రివీల్ చేసి రిలీజ్ డేట్ మాత్రం ఊరించి ఊరించి ఫిక్స్ చేసే రాజమౌళి ఈ సారి సగం సినిమా చూపించి మిగతా సగానికి డేట్ ఫిక్స్ చేశాడు. ఏది ఏమైనా 2017 ఏప్రిల్ 28 న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని సీక్రెట్ తెలిసిపోతుంది. ఇదంతా వన్ సైడ్ స్టోరీ. అసలు విషయం ఏమిటంటే 2017 ఏప్రిల్ 28 కేవలం బాహుబలి కే సొంతం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు దృష్టి కూడా ఈ తేదీ పైనే ఉంది.

సంవత్సరంలో ఇన్ని రోజులుండగా మహేష్ బాబు దృష్టి ఈ డేట్ పైనే ఎందుకు పడిందబ్బా అనే కదా ఆలోచిస్తున్నారు..? కారణం ఉంది. మహేష్ బాబు కరియర్ ని పీక్ స్టేజ్ కి తీసుకు వెళ్లిన పోకిరి సినిమా రిలీజ్ అయినా డేట్ అది. 2006 ఏప్రిల్ 28 న రిలీజ్ అయినా పోకిరి రిలీజ్ డేట్ అది కాబట్టి సెంటిమెంట్ గా ఫీల్ అయిన మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రాన్ని ఆ తేదీకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

గతంలో కూడా ప్రభాస్-మహేష్ సినిమాల మధ్య పోటీ నడిచింది. బాహుబలి-ది బిగెనింగ్ విడుదలైన వారం రోజులకే శ్రీమంతుడు థియేటర్లలోకి వచ్చాడు. బాహుబలి సినిమా ఆల్ టైం హిట్స్ లో నంబర్ వన్ స్థానం దక్కించుకుంటే.. శ్రీమంతుడు సినిమా సెకెండ్ ప్లేస్ లో నిలిచింది. ఈసారి కూడా బాహుబలి-2, మహేష్ సినిమా మధ్య పోటీ తప్పదంటున్నారు క్రిటిక్స్.