ప్రభాస్ ‘సాహో’ లో మరో బాలీవుడ్ నటుడు

Monday,August 21,2017 - 01:10 by Z_CLU

ప్రభాస్ సాహో షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడిని ఫిక్స్ చేసుకుంది సాహో టీమ్. ఇప్పటికే బాలీవుడ్ నటులు చుంకీ పాండే, నీల్ నితిన్ ముకేష్ ని ఫిక్స్ చేసుకున్న సాహో టీమ్ జాకీష్రాఫ్ ని వన్ ఆఫ్ ది విలన్ గా ఫిక్స్ చేసుకుంది. ఆల్ రెడీ షూటింగ్ జరుపుకుంటున్న సాహో సెట్స్ పైకి నెక్స్ట్ వీక్ నుండి జాయిన్ అవుతున్నాడు జాకీష్రాఫ్.

జాకీష్రాఫ్ గతంలో పవన్ కళ్యాణ్ పంజాలో మెయిన్ విలన్ గా నటించాడు. ఇప్పుడే ప్రభాస్ సాహోలోను హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కీ రోల్ లో కనిపించనున్నాడు జాకీష్రాఫ్. రీసెంట్ గా  ఈ సినిమా ఆహీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ని ఫైనలైజ్ చేసుకున్న సినిమా యూనిట్, పక్కా ప్లానింగ్ షూటింగ్ జరుపుకుంటుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్.