NTR బయోపిక్ నుండి బాలయ్య మరో లుక్

Monday,October 22,2018 - 04:01 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది NTR బయోపిక్. అయితే ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ఈ సినిమా నుండి మరో స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘వేటగాడు’ సినిమాలోని ‘ఆకు చాటు పిందె తడిసె’ సాంగ్ లోని NTR గెటప్ లో ఉన్న బాలయ్య స్టిల్, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని మరింత ఎట్రాక్ట్ చేస్తుంది.

ఆల్మోస్ట్ ఈ సాంగ్ లో NTR వేసిన స్టెప్స్ నే బాలయ్య వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ చుట్టూ తిరిగే సీన్స్ కి ప్యాకప్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్స్, ప్రస్తుతం సినిమాలోని మరిన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు.

క్రిష్ డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. సంక్రాంతి కానుకగా 9 జనవరికి ‘కథానాయకుడు’, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24 న ఈ బయోపిక్ 2 వ భాగం ‘మహా నాయకుడు’ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజర్.