అంకితకు బాబు పుట్టాడు

Monday,November 27,2017 - 01:54 by Z_CLU

ఒకప్పటి హీరోయిన్ అంకితకు బాబు పుట్టాడు. జేపీ మోర్గాన్ సంస్థ వైస్-ప్రెసిడెంట్ విశాల్ జగపత్, అంకిత గతేడాది పెళ్లి చేసుకొని న్యూజెర్సీలో సెటిల్ అయ్యారు. వాళ్లకు ఇప్పుడు బాబు పుట్టాడు. ప్రస్తుతం అంకిత, బాబు ఆరోగ్యంగా ఉన్నారని విశాల్ ప్రకటించాడు.

2009లో వచ్చిన పోలీస్ అధికారి అనే సినిమా అంకిత చేసిన లాస్ట్ మూవీ. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమెకు అవకాశాలు రాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది అంకిత. పూర్తిగా కుటుంబానికి పరిమితమైపోయింది.

తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, గోపీచంద్ లాంటి స్టార్స్ సరసన నటించింది అంకిత. లాహిరి లాహిరి లాహిరి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అంకిత.. తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది.