అమెరికన్ పోలీస్ గా అంజలి

Friday,November 01,2019 - 03:52 by Z_CLU

హీరోయిన్ అంజలి మరో ఇంట్రెస్టింగ్ పాత్రతో టాలీవుడ్ స్క్రీన్ పైకి వచ్చింది. అనుష్క మెయిన్ లీడ్ పోషిస్తున్న నిశ్శబ్దం సినిమాలో ఆమె అమెరికన్ పోలీస్ గా కనిపించనుంది. ఆమె లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహ అనే క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్ గా అంజలి ఈ సినిమాలో కనిపించనుంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే అనుష్క లుక్ రిలీజైంది. సాక్షి అనే పాత్రలో అనుష్క కనిపించనుంది. ఆ తర్వాత మాధవన్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో లుక్ లో భాగంగా అనుష్క స్టిల్ ను విడుదల చేశారు. అనుష్క, మాధవన్ తర్వాత అంజలి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే.. సినిమాలో అంజలి పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

త్వరలోనే ఈ సినిమా నుంచి అవసరాల శ్రీనివాస్, షాలినీ పాండే లుక్స్ ను కూడా విడుదల చేయబోతున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో నిశ్శబ్దం సినిమాను విడుదల చేయబోతున్నారు.