BB3 - హీరోయిన్ ఆమెనా?

Tuesday,September 08,2020 - 12:20 by Z_CLU

బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న BB3 సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్సవ్వలేదన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు బాలయ్య సరసన ఎవరైనా కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని చూసిన మేకర్స్ తాజాగా Anjali ని హీరోయిన్ తీసుకోవాలని భావిస్తున్నారట.

గతంలో Balakrishna తో ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలి నే ఇప్పుడు మరోసారి బాలయ్య సరసన హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది. కేవలం వారం రోజులు షూట్ చేసుకొని కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే మళ్ళీ షూటింగ్ జరుపుకోనుంది.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే టైటిల్ ప్రకటించనున్నారు. Balayya-Boyapati కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.