ఆ రెండు సినిమాలపైనే అంజలి ఆశ

Monday,April 06,2020 - 01:46 by Z_CLU

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వచ్చిన కొత్తలో అంజలిని అంతా ఆకాశానికెత్తేశారు. మరో ప్రామిసింగ్ హీరోయిన్ టాలీవుడ్ కు దొరికిందని చెప్పుకొచ్చారు. అయితే అంజలి కెరీర్ మాత్రం అంతంతమాత్రంగానే కొనసాగింది. ఒక దశలో తెలుగులో ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలు అందుకుంటున్న అంజలి, త్వరలోనే రాబోతున్న రెండు సినిమాలపై భారీ ఆశలు పెట్టుకుంది.

వాటిలో ఒకటి నిశ్శబ్దం. అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో మరో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది అంజలి. అమెరికన్ లేడీ కాప్ గెటప్ లో ఆమె కనిపించనుంది. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎఁట్రీ మూవీ వకీల్ సాబ్ లో కూడా అంజలి నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తనను మళ్లీ లైమ్ లైట్లోకి తీసుకొస్తాయని ఆమె భావిస్తోంది.

రీసెంట్ గా అంజలి చాలా మేకోవర్ అయింది. బాగా బరువు తగ్గి స్లిమ్ అయింది. స్లిమ్ అయిన తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పైకి రాలేదు. సో.. రాబోయే రెండు సినిమాల్లో తన పాత్రలతో పాటు, తన మేకోవర్ కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుందని భావిస్తోంది ఈ టాలీవుడ్ “సీతమ్మ”.