మరో హారర్ థ్రిల్లర్ లో అంజలి

Monday,February 13,2017 - 12:53 by Z_CLU

రొటీన్ సినిమాలతో కంపేర్ చేస్తే మినిమం డిఫెరెన్స్ లేనిదే అంత ఈజీగా సంతకం పెట్టదు గడుసు పిల్ల అంజలి. ఎన్ని సినిమాలు చేశాం అనేదాని కన్నా ఎలాంటి సినిమాలు చేశాం అన్న కాన్సెప్ట్ నే స్ట్రాంగ్ గా బిలీవ్ చేసే అంజలి, బన్ని ‘సరైనోడు’ స్పెషల్ సాంగ్ లో మెస్మరైజ్ చేసిన అంజలి, మళ్ళీ ఇన్నాళ్ళకు ఏకంగా భయపెట్టడానికి రెడీ అవుతుంది.

ఆశోక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘చిత్రాంగద’ ఆల్ మోస్ట్ రిలీజ్ కి రెడీ అయింది. మరీ హడావిడి లేకుండా కాస్త డిఫెరెంట్ గా ఒక్కో పాటను ఒక్కో లైవ్ షో ద్వారా రిలీజ్ చేయాలని డిసైడ్ అయిన సినిమా యూనిట్, మార్చి 3 న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

chitrangada-anjali-zee-cinemalu

కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఇబ్బందిపడే అమ్మాయి క్యారెక్టర్ లో నటించిన అంజలి, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుండి ఎలా బయటపడింది అనే ప్లాట్ తో తెరకెక్కిన ఈ సినిమా USA లోని కొన్ని ఇంటరెస్టింగ్ లొకేషన్స్  లో తెరకెక్కింది.