ఆ హీరోయిన్ కి పెళ్ళి త్వరలో...

Saturday,January 26,2019 - 10:03 by Z_CLU

రీసెంట్ గా ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి మరింత దగ్గరైన అనీషా అంబ్రోస్ కి పెళ్ళి ఫిక్సయింది. పెళ్ళి కొడుకు వివరాలు ప్రస్తుతానికి తెలీదు కానీ, డెఫ్ఫినెట్ గా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు అని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది.

‘అలియాస్ జానకి’ అనే సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన అనీషా, ఆ తరవాత ‘గోపాల గోపాల, ‘అ!’, ‘మనమంతా’, ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ‘7’ సినిమాలోను కీ రోల్ ప్లే చేస్తుంది అనీషా.

మరీ కమర్షియల్ హీరోయిన్ గా టాప్ స్థాయిలో లేకపోయినా, ఆల్మోస్ట్ గుర్తింపునివ్వగలిగే క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న అనీషా, పెళ్ళి తరవాత ఎప్పటిలాగే సినిమాలో నటిస్తుందా లేదా అనేది చూడాలి.