RRR Anirudh - టీంలో చేరిన అనిరుథ్

Monday,July 26,2021 - 06:09 by Z_CLU

రిలీజ్ కి దగ్గర పడే కొద్ది RRR మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటివలే మేకింగ్ వీడియోతో మరింత హైప్ క్రియేట్ చేసి అక్టోబర్ 13 న రిలీజ్ అంటూ ప్రకటించారు. దీంతో ఇకపై రాజమౌళి మార్కెటింగ్ స్టాటజీ , ప్రమోషన్ ప్లానింగ్ పై ఇండస్ట్రీ లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేసి RRR హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్న జక్కన్న ఆ సాంగ్ కోసం ఇప్పుడు అనిరుద్ ని కూడా బరిలోకి దింపాడు.

అవును RRR ప్రమోషనల్ కోసం అనిరుద్ వర్క్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా కీరవాణి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.”Had a great session with Anirudh for RRR. అంటూ అనిరుద్ టాలెంట్ ని కూడా పొగుడుతూ అతను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో చెప్పే ప్రయత్నం చేశారు కీరవాణి. కాకపోతే అనిరుద్ ఈ సాంగ్ కోసం మ్యూజిక్ అందించాడా ? లేదా తన గొంతు అందించి పాడాడా ? అనేది చెప్పలేదు కీరవాణి.

anirudh zeecinemalu

సంగీత దర్శకుడు అనిరుధ్

దీంతో అనిరుద్ సింగింగ్ ఆ ? మ్యూజిక్ పరంగా ఏమైనా కీరవాణి గారికి సపోర్ట్ అందించాడా ? అనే విషయంపై చర్చ నడుస్తుంది. మరి యూత్ ని తన పాటలతో ఉర్రూతలూగించిన అనిరుద్ RRR కి ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లో తారక్ , చరణ్ అలియా భట్ మిగతా నటీ నటులతో పాటు టెక్నీషియన్స్ కూడా కనిపించనున్నారు. అలాగే రాజమౌళి డైరెక్ట్ చేసిన హీరోలందరూ ఈ సాంగ్ లో కనిపిస్తారనే టాక్ కూడా నడుస్తుంది. DVV ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics